జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్ట్

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్ట్
x
YS Jaganmohan Reddy(File photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ కుటుంబంలో కరోనా శాంపిల్ పరీక్షలు జరపాలని నిర్ణయించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్ట్ జరపాలని ఆదేశించారు. ముందుగా రెడ్ జోన్ మండలాల్లో దీన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఇదే ఫార్ములాను ఏపీలో కూడా అమలు చేయనున్నారు.

తాజా నిర్ణయంతో గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో ఇంటికొకరికి కరోనా టెస్టులు జరిపించబోతోంది. ముందుగా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శనివారం ప్రతి ఇంట్లో ఒకరికి చొప్పున కరోనా పరీక్షలు చేశారు. గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఇంటికి ఒకరిని తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఈ ఫలితా మరో రెండు రోజుల్లో వస్తాయి. టెస్టుల్లో ఎవరికైనా పాటిజివ్ వస్తే.. చుట్టుపక్కల ఇళ్లలో అందరికీ టెస్టులు జరిపిస్తారు. ఏపీలో శనివారం కొత్తగా 62 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 1525కి చేరింది. వాటిలో 441 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. అందువల్ల ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories