ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు.. గత ప్రభుత్వం పెట్టిన ఇళ్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు.. గత ప్రభుత్వం పెట్టిన ఇళ్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయం
x
YS Jagan (File Photo)
Highlights

ఏపీలోని పేద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సర్కార్ శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం హయాంలో పేదలకు ఇళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు....

ఏపీలోని పేద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సర్కార్ శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం హయాంలో పేదలకు ఇళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు గానూ..1,323 కోట్ల రూపాయలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా.. పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఎక్కడా పొరపాట్లకు జరగకుండా ఈ చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక స్పష్టమైన తేదీని ప్రకటించాలని సీఎం జగన్ అధికారులకు వెల్లడించారు. తొలి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణలపై సీఎం సమీక్షించ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి విడతలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు.

నిర్దేశిత నమూనాలో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, వంట గది, హాలు, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని సీఎం తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా సీఎం సమీక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.

పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు లేకుండా ఇంటిని సమకూర్చాలి. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలి సీఎం అన్నారు. ఈ సమావేశంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌సహా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories