AP Government: ట్రావెల్స్ లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు..

AP Government: ట్రావెల్స్ లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు..
x
Highlights

AP Government | కరోనా పుణ్యమాని అంతరాష్ట్ర సర్వీసులు ఇంకా ఒక గాటన పడలేదు..

AP Government | కరోనా పుణ్యమాని అంతరాష్ట్ర సర్వీసులు ఇంకా ఒక గాటన పడలేదు.. రోజు వారీ ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులు ఇంకా పునరుద్ధరణ కాలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. వీలైనంత వరకు తనిఖీలు చేసి, కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గత వారం రోజులుగా ప్రైవేట్‌ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ 150 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళుతున్నాయి. ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత విజయవాడ–హైదరాబాద్‌ రూట్‌లో తనిఖీలకు శ్రీకారం చుట్టారు.

► టీఎస్‌ ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం కొనసాగుతుండటం ప్రైవేట్‌ ఆపరేటర్లకు కలిసొచ్చింది.

► ప్రతి రోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో 4 వేల మంది వెళుతున్నారు. ప్రైవేట్‌ బస్సులే దిక్కు కావడంతో ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు.

► హైదరాబాద్‌ నుంచి విజయవాడకు స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో రూ.800.

► నాన్‌ ఏసీ టికెట్‌ ధర ఆర్టీసీలో రూ.400 వరకు ఉండగా, ప్రైవేట్‌ ఆపరేటర్లు రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు.

► మరోవైపు ట్రావెల్స్‌ నిర్వాహకులు క్వార్టర్లీ ట్యాక్స్‌ చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే బస్సులు నడపాలి. ప్రయాణికుల అవసరాలను అవకాశంగా తీసుకుని అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో తనిఖీలు చేపడుతున్నాం అని రవాణా శాఖ అదనపు కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories