జీతం మొత్తం తిరిగి చెల్లించండి.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్!

జీతం మొత్తం తిరిగి చెల్లించండి.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్!
x
Andhra Pradesh Grama Sachivalayam
Highlights

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకం జరిగిన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షాముప్ఫైవేల మంది సచివాలయ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకం జరిగిన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షాముప్ఫైవేల మంది సచివాలయ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.ఉద్యోగాలు వచ్చిన వారు యమ సంతోషంగా ఉన్నారు. కొంతమందికి మాత్రం సచివాలయ ఉద్యోగాల తోపాటు వేరే వాటిలో కూడా వచ్చాయి. దాంతో అటువంటి వారు సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే కేవలం ఒక్క రాజీనామా లేఖ ఇస్తే సరిపోతుందా అంటే కుదరదు.. రాజీనామాకు సంబంధించి కఠినమైన నిబంధనలు విధించింది. సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేయాలి అనుకున్న ఉద్యోగి అప్పటి వరకు తీసుకున్న జీతం ఎంతైతే ఉందొ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తరువాత రాజీనామాను ఆమోదిస్తారు. తాజాగా ఇటువంటి సమస్యే ఓ సచివాలయ ఉద్యోగికి ఎదురైంది.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి గ్రామ సచివాలయంలో మహేష్‌రెడ్డి అనే ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి ఇటీవల రైల్వేలో మరొక ఉద్యోగం వచ్చింది.. దాంతో గ్రామ సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కానీ అతని రాజీనామాను అధికారులు ఆమోదించలేదు.. దానికి కారణం ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రూ. 2 వేలు, 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం కలిపి జీతంగా తీసుకున్న మొత్తం రూ. 57,095 లను తిరిగి కట్టాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలో అతను చేసేదేమి లేక జీతం కింద తీసుకున్న ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమయ్యాడు.

ఇతనే కాదు విజయనగరం జిల్లాలో కూడా కొంతమంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురైంది. గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాంలో ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్లకు ఇటీవల వేరే ఉద్యోగాలు వచ్చాయి.. దాంతో వారు కూడా సచివాలయ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అయితే అధికారులు వారి రాజీనామాలను ఆమోదించలేదు. ఇప్పటివరకూ తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు అన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో వారు షాక్ కు గురయ్యారు. వీరు కూడా ఎలాగోలా ఆ మొత్తాన్ని కట్టడానికి సిద్ధమయ్యారు.

ఇదిలాఉంటే వాస్తవానికి ఈ నిబంధన వీరు జాయిన్ అయిన మొదట్లోనే వచ్చింది. జీతం తిరిగి చెల్లించే విషయాన్ని రూల్ నెంబర్ 9లో ప్రస్తావించామని.. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories