ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్.. అర్ధరాత్రి ఉత్తర్వులు

ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్.. అర్ధరాత్రి ఉత్తర్వులు
x
G vani mohan(file photo)
Highlights

హైకోర్టు తీర్పుతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించే సమయానికి కొత్త ట్వీస్ట్ చోటుచేసుకుంది.

హైకోర్టు తీర్పుతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించే సమయానికి కొత్త ట్వీస్ట్ చోటుచేసుకుంది.ఆయన నియామకం చెల్లదంటూ ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి శనివారం అర్ధరాత్రి ప్రకటించారు. ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన జి.వాణీమోహన్‌ను నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

వాణి మోహన్ ను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు వెలువరించారు. ఆమె సహకారశాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆమెకు ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డైరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీగా, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories