Beds For Corona Patients in AP: రోగులకు సరిపడా బెడ్లు.. ఏపీ ప్రభుత్వం వెల్లడి

Beds For Corona Patients in AP: రోగులకు సరిపడా బెడ్లు.. ఏపీ ప్రభుత్వం వెల్లడి
x
Beds for Corona Patients in AP
Highlights

Beds For Corona Patients in AP: ఒక పక్క కరోనా విలయ తాండవం చేస్తోంది... వారికి వైద్యం అందించేందుకు సరిపడా బెడ్లు ఉండాలి.

Beds For Corona Patients in AP: ఒక పక్క కరోనా విలయ తాండవం చేస్తోంది... వారికి వైద్యం అందించేందుకు సరిపడా బెడ్లు ఉండాలి... చికిత్స చేసేందుకు సరిపడా వైద్యులు, ఇతర సిబ్బంది ఉండాలి. కేవలం అర గంటలో బెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానికి అనుగుణంగా జిల్లా, డివిజన్ స్థాయి అస్పత్రుల్లో ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో అవసరమైన మేర తాత్కాలిక పద్ధతిపై వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ అమల్లోకి వస్తే కరోనా వైరస్ పై మరింత పోరాడే అవకాశం ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు, ఎన్ని వెంటిలేటర్ల అందుబాటులో ఉన్నాయ‌నే వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరోగ్య శాఖ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచింది. వివిధ జిల్లాల్లోని కొవిడ్ ఆస్పత్రుల్లో శనివారం సాయంత్రం నాటికి 24,738 ప‌డ‌క‌ల‌తో పాటు 1,171 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

జిల్లాల వారీగా వివరాలు :

శ్రీకాకుళం జిల్లాలో 3,847 బెడ్లు 23 వెంటిలేటర్లు

♦ విజయనగరం జిల్లాలో 1,258 బెడ్లు, 15 వెంటిలేటర్లు

♦ విశాఖపట్నం జిల్లాలో 4,456 బెడ్లు 207 వెంటిలేటర్లు

♦ తూర్పు గోదావరి జిల్లాలో 1,813 బెడ్స్, 60 వెంటిలేటర్స్

♦ పశ్చిమ గోదావరి జిల్లాలో 1,369 బెడ్స్,15 వెంటిలేటర్లు

♦ కృష్ణా జిల్లాలో 1,736 బెడ్స్, 117 వెంటిలేటర్స్

♦ గుంటూరు జిల్లాలో 1,496 బెడ్స్, 186 వెంటిలేటర్స్

♦ ప్రకాశం జిల్లాలో 114 బెడ్స్, 96 వెంటిలేటర్లు

♦ నెల్లూరు జిల్లాలో 1073 పడకలు, 167 వెంటిలేటర్లు,

♦ అనంతపురం జిల్లాలో 1854 బెడ్లు,16 వెంటిలేటర్లు,

♦ చిత్తూరు జిల్లాలో 3,002 బెడ్లతో పాటు 122 వెంటిలేటర్లు

♦ కడపలో 385 బెడ్స్, 52 వెంటిలేటర్లు,

♦ కర్నూలు జిల్లాలో 2,335 బెడ్స్ తో పాటు 95 వెంటిలేటర్లు

Show Full Article
Print Article
Next Story
More Stories