వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఏపీ : ఆర్‌బీఐ

వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఏపీ : ఆర్‌బీఐ
x
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రస్థానం సాధించింది.

అమరావతి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రస్థానం సాధించింది. పండ్ల ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. రాష్ట్రం 1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. చేపల ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించింది. రాష్ట్రం 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేసింది.

ఆర్థిక రంగంలోనూ రాష్ట్రం స్థిరమైన పురోగతి సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ₹15.93 లక్షల కోట్లుగా నమోదైంది. తలసరి జీఎస్డిపీ ₹2.66 లక్షలుగా ఉంది. విద్యుత్ లభ్యతలో ఆంధ్రప్రదేశ్ 1481 యూనిట్లతో దేశంలో 14వ స్థానంలో నిలిచింది. జనాభా ఆరోగ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌లో సగటు జీవితకాలం 70 సంవత్సరాలుగా నమోదైంది. ఇందులో పురుషుల సగటు జీవితకాలం 68 సంవత్సరాలు, మహిళలది 73 సంవత్సరాలుగా ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories