Andhra Pradesh employees salaries: ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

Andhra Pradesh employees salaries: ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్
x
Representational Image
Highlights

Andhra Pradesh employees salaries: ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వం పంపిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

Andhra Pradesh employees salaries: ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వం పంపిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించేందుకు అడ్డంకి తొలగిపోయింది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించడంలో రెండు పార్టీల మధ్య ఏర్పడిన వివాదం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపడంతో జీతాలు చెల్లించేందుకు మార్గం సుగమమయ్యింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది. ఇరు పార్టీల మధ్య రేగిన వివాదం కారణంగా మండలి డిప్యుటీ చైర్మన్‌ ద్రవ్య వినమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది.

నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్‌ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్‌కు ద్రవ్య వినయమ బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ప్రభుత్వోద్యోగులకు ఈరోజు లేదా రేపు జీతాలు అందే అవకాశాలున్నాయి. జీతాలు ఆలస్యం అయి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఉపశమనం లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories