టెన్త్ పరీక్షలపై ఏపీ మంత్రి సురేష్ కీలక వ్యాఖ్యలు

టెన్త్ పరీక్షలపై ఏపీ మంత్రి సురేష్ కీలక వ్యాఖ్యలు
x
Representational image
Highlights

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు.

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్‌ పొఖ్రియల్‌ నిశాంక్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని చెప్పారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

అయితే దేశవ్యాప్తంగా మే3వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. లాక్‌డౌన్ పొడిగించాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

లాక్‌ డౌన్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరిగే వరకు ఆన్‌లైన్‌లో.. డీడీ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు వినాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటల వరకు పాఠాలను వినాలని మంత్రి సురేష్ చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories