Education Minister Adimulapu Suresh Babu:త్వరలోనే ఏపీలో బడులు తెరుచుకుంటాయి

Education Minister Adimulapu Suresh Babu:త్వరలోనే ఏపీలో బడులు తెరుచుకుంటాయి
x
Education Minister Adimulapu Suresh Babu file photo
Highlights

Education Minister Adimulapu Suresh Babu: డిగ్రీ, పీజీ పరీక్షలపై కేంద్ర నుంచి వచ్చిన గైడ్ లైన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్.

Education Minister Adimulapu Suresh Babu: డిగ్రీ, పీజీ పరీక్షలపై కేంద్ర నుంచి వచ్చిన గైడ్ లైన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాల రూపు మార్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు- నేడు చెప్పట్టమని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల పైన ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి అదిములపు సురేష్ వెల్లడించారు. విద్యార్థులకు పాఠ్య శాలల్లో అనుమానాలకు నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ (1800 123 123 124)ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేల స్కూల్స్ ని ఎంపిక చేసామని చెప్పారు. నాడు- నేడు లో 9 అంశాలు కసిచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు చేస్తామనీ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కచ్చితంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. నాడు- నేడులో అన్ని శాఖ అధికారుల సమన్వయంతో చేసి వేగంగా పనులు పూర్తి చేస్తామనీ మంత్రి పేర్కొన్నారు.

రివర్స్ టెండరింగ్ విధానం వలన రూ. 143 కోట్లను ఆదా అయింట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసే వాటిలో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామనీ, తమ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వాటిలో ఎవరు తక్కువకీ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నాణ్యతతో లోపం లేకుండా చర్యలు తీసుకుంటుమన్నారు. నాడు-నేడు మొదటిలో భాగంగా 15,750 స్కూల్స్ ఎంపిక అయ్యాయి. ఇప్పటి వరకు నాడు- నేడు కి సంబంధించి ఫేస్ 1 లో 504 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు మంత్రి చెప్పారు. 710 కోట్లను ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద ఏర్పాటు చేసామనీ,నాడు- నేడు కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ నిధులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారనీ మంత్రి తెలిపారు. నాడు- నేడు కార్యక్రమానికి సంబంధించి కర్చుపెట్టే ప్రతి రూపాయి అందరికి తెలిసేలాగా ఆన్లైన్ లో పెట్టామని, జూలై నెలాఖరికి మేము చేప్పట్టిన నాడు- నేడు పనులు స్పష్టంగా కనిపిస్తాయనీ పేర్కొన్నారు. బడ్జెట్ లో 16 శాతం ప్రభుత్వం విద్యకు ఖర్చు చేస్తుందనీ, కరోనా నేపథ్యంలో త్వరలోనే పాఠశాలను తెరవబోతున్నామనీ మంత్రి చెప్పారు.హెచ్.ఎమ్ లు ఏ సమస్య వచ్చినా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామనీ, మీరు మీ సమస్య చెపితే వెంటనే పరిక్షరిస్తామనీ హామీ ఇచ్చారు. ప్రధానోపాద్యాలకు మేము అండగా ఉంటామనీ అన్నారు. ఉద్యోగ సంఘాలు, హెచ్.ఎమ్ ల అసోసియేషన్ లతో తాను స్వయంగా మాట్లాడతాననీ మంత్రి ఆదిములాపు సురేష్ చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories