మీరు చూపిన ప్రేమకు సెల్యూట్‌ .. వైరల్ వీడియోపై స్పందించిన ఏపీ డీజీపీ

మీరు చూపిన ప్రేమకు సెల్యూట్‌ .. వైరల్ వీడియోపై స్పందించిన ఏపీ డీజీపీ
x
Highlights

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ మహిళ ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూల్ డ్రింక్స్ అందించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నా సంగతి తెలిసిందే.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ మహిళ ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూల్ డ్రింక్స్ అందించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నా సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ స్పందించారు. ఈ వీడియోలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఓ మహిళ రెండు పెద్ద కూల్ డ్రింక్స్ బాటిల్స్ తెచ్చి అందివ్వగా.. పోలీసులు సున్నితంగా తిరస్కరించారు.

ప్రజలందరూ ఇళ్లలో ఉంటే చాలు, తమకు ఇంకేమీ వద్దు అంటూ తిరస్కరించారు. అయినప్పటికీ తీసుకోవాల్సిందిగా ఆ మహిళ మరీ మరీ కోరతారు. ఆ తరువాత తన వివరాలు అడిగిన పోలీసులకు... తనో కూలీనని, తన ఆదాయం నెలకు రూ.3 వేలని చెపుతుంది. రాత్రి పగలు ప్రజల్ని కంటికి రెప్పలా కచుకుంటున్న పోలీసులకు గ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తాను ఇలాచేసానని ఆమె వివరిస్తారు. దీనితో చలించిపోయిన పోలీసులు '' మీకు వీలైతే ఒకసారి మాకు కనిపిస్తే ధైర్యంగా ఉంటుంది'' అంటూ సాగిన వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ అయింది.

అయితే తాజాగా దీనిపై ఏకంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు. ఆ మహిళ వివరాలు తెలుసుకొని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా ఆమెతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ''మీ మంచితనానికి మేమంతా చలించిపోయాం. విధినిర్వహణలో ఉన్న పోలీసులపై మీరు చూపిన ప్రేమకు అంతా సెల్యూట్‌ చేస్తున్నామమ్మా'' అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories