ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్ళాలంటే.. పాస్ అవసరం లేదు, రూల్స్ పాటించాలి

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్ళాలంటే.. పాస్ అవసరం లేదు, రూల్స్ పాటించాలి
x
Dgp Goutam Sawang(file photo)
Highlights

దేశ్యాప్తంగా లాక్‌డౌన్ ఐదోదశ మొదలైంది. ఈ జూన్ 30 వరకు కొనసాగనుంది.

దేశ్యాప్తంగా లాక్‌డౌన్ ఐదోదశ మొదలైంది. ఈ జూన్ 30 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయగా.. ఆయా రాష్ట్రాలు కూడా కేంద్ర మార్గదర్శకాలతో పాటూ కొన్ని నిబంధనలు విధించింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలనకునేవారికి రూల్స్ పాటించాల్సిందే అని పోలీసులు స్పష్టం చేశారు. ఏపీకి వచ్చేవారికి సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల దగ్గర తప్పకుండా కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి, అందరూ అందుకు సహకరించాలని కోరారు.

రోడ్డు మార్గాన ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు కచ్చితంగా 'స్పందన(spandana)' పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఏడు రోజులు Institional Qurantineలో ఉండి కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అంతర్ రాష్ట్ర కదిలకలపై నిర్ణయం తీసుకునే వరకు ఈ షరతలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories