
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మే నెల 3 లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మే నెల 3 లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తూ.. తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. కొందరు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటూ.. కొంతమంది స్థానికులు, రాజకీయ నేతలు, మరికొందరు భోజన ఏర్పాట్లు చేసి కష్టకాలంలోమేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి దంపతులు. అదేబాటలో నడుస్తున్నారు.
పుష్పశ్రీవాణి విశాఖలోని సొంత నియోజకవర్గం కురుపాంలో పేదల ఆకలి తీరుస్తున్నారు. కొద్ది రోజులుగా పేదలకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్పశ్రీవాణి తన భర్తతో కలిసి స్వయంగా వంట చేస్తున్నారు. కూరగాయలు తరిగి వంటలు సిద్ధం చేస్తున్నారు. ఫుడ్‌ని పార్శిల్స్ చేసి పేదలకు అందిస్తున్నారు. ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్ధితులలో నియోజకవర్గంలో.. రోజూ పేదవారికి ఆహారం అందిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదవారికి ఎవరికి సాధ్యమైనంత వరకు వారు సహాయం చేయాలని పుష్పశ్రీవాణి పిలుపు ఇచ్చారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




