Vinayaka Chavithi 2020: వినాయక చవితి వేడుకలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Vinayaka Chavithi 2020: వినాయక చవితి వేడుకలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
x
Vinayaka Chavithi (File Photo)
Highlights

Vinayaka Chavithi 2020: వినాయక చవితి వేడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Vinayaka Chavithi 2020: వినాయక చవితి వేడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమర్జనాలకు అనుమతి లేదని.. ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అంతే కాదు అటు విగ్రహాల పొడవు 2 అడుగులు కంటే ఎక్కువ ఉండకూడదని, ప్రతిష్టించిన చోటే నిమర్జనం చేయాలని వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వేంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఇక పొతే బుధవారం రాష్ట్రంలో నమోదయిన పాజిటివ్ కేసులు చుస్తే.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,742 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 57,685 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,742 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,061 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లా 15, నెల్లూరు జిల్లా 15, అనంతపురం జిల్లా 08, గుంటూరు జిల్లా 07, ప్రకాశం జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 06, తూర్పు గోదావరి జిల్లా 05, విశాఖపట్నం జిల్లా 05, విజయనగరం జిల్లా 05, పశ్చిమ గోదావరి జిల్లా 05, కడప జిల్లాలో 04, కృష్ణ జిల్లా 03, కర్నూలు జిల్లా 02, కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,16,003. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,906. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,26,372 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 86,725 మంది చికిత్స పొందుతున్నారు. గత 24గంటల్లో 57,685 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 30,19,296 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories