ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలి : కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలి : కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌
x
Task Force Chairman Krishna Babu
Highlights

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు.

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వస్తాయని చెప్పారు. ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి చేరుకున్నవారికి రెండు రకాల క్వారంటైన్లు సూచిస్తున్నామనీ, పెయిడ్‌, ఉచిత క్వారంటైన్‌లలో ఏదైనా ఎంచుకోవచ్చన్నారు. క్వారంటైన్‌ లేదా కొవిడ్‌ ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

2 వారాల క్వారంటైన్‌ తర్వాత మళ్లీ 14 రోజకుల హోం క్వారంటైన్‌ పాటించాలిని, ఢిల్లీలో నోడల్‌ అధికారిగా హరీశ్‌కుమార్‌, ఏపీలో బాబూరావు నాయుడు ఉంటారు. వలస కార్మికుల గురించి మరో 14 రైళ్లకు సంబంధించిన ప్రణాళిక పంపాం. ఇప్పటికే ఏపీకి రెండు రైళ్లు చేరుకున్నాయి. రైళ్లు వెళ్లేందుకు రాజస్థాన్‌, బెంగాల్‌ ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఒక్క రైలు పంపేందుకే ఝార్ఖండ్‌ అనుమతిచ్చింది. అందుకే ఇతర రాష్ట్రాలకు కూలీలను త్వరగా పంపలేకపోతున్నాం అని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories