కర్నూలులో 84 పాజిటివ్ కేసులు.. విశాఖలో తగ్గిన కేసులు

కర్నూలులో 84 పాజిటివ్ కేసులు.. విశాఖలో తగ్గిన కేసులు
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ తో మరొకరు చనిపోయారు. ఈ విషయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో ధ్రువీకరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ తో మరొకరు చనిపోయారు. ఈ విషయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో ధ్రువీకరించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ‌నివారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు (ఆదివారం) 12వ‌ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

కొత్త‌గా న‌మోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో 7, కర్నూలులో 2, నెల్లూరులో 4, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ 19 కారణంగా ఒక‌రు చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య‌ ఏడుకి చేరింది. రాష్ట్రంలో మొత్తం 420 కేసుల్లో 12 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 84 కేసులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారిగా క‌రోనా కేసులు చూస్తే:

గుంటూరు(82)

♦ నెల్లూరు(52),

♦ క‌ర్నూలు(84),

♦ చిత్తూరు(21),

♦ తూర్పుగోదావ‌రి(17),

♦ ప‌శ్చిమ‌గోదావ‌రి(22),

♦ విశాఖ‌ప‌ట్నం(20),

♦ అనంత‌పురం(15),

♦ క‌డ‌ప‌(31),

విజ‌యన‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి. విశాఖ‌లో గ‌త మూడు రోజులుగా ఒక్క‌కేసు న‌మోదు కాలేదు.




Show Full Article
Print Article
Next Story
More Stories