ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. నలుగురు వైద్య సిబ్బందికి కరోనా

ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. నలుగురు వైద్య సిబ్బందికి కరోనా
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కాగా.. ఇవాళ ఒక్క రోజు గుంటూరులో 9మందికి పాజిటివ్ రాగా.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కాగా.. ఇవాళ ఒక్క రోజు గుంటూరులో 9మందికి పాజిటివ్ రాగా.. అనంతపురం జిల్లాలో ఈ ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌ వెల్లడించారు. వైద్యసిబ్బంది అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చెందినవారని ఆయన తెలిపారు. చికిత్స సమయంలో జరిగిన పొరపాటు వల్ల సిబ్బందికి వైరస్‌ సోకిందన్నారు.

ప్రస్తుతం నమోదైన కేసులతో కలిపి అనంతపురం జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 13కి చేరిందని ఆయన వెల్లడించారు. ఇటీవల హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడని, చికిత్స చేసిన వైద్య సిబ్బందికీ కరోనా సోకినట్లు తాజాగా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో తెలిపారు. మరోవైపు కర్నూలు జిల్లాలో మరొక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ వెల్లడించారు. దీంతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 75కి చేరుకుంది. తాజాగా నెల్లూరులో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో నెల్లూరులో మొత్తం 49 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories