తెలుగు రాష్టాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన జగన్, చంద్రబాబు

తెలుగు రాష్టాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన జగన్, చంద్రబాబు
x
YSJagan and chandrababu
Highlights

నేడు శ్రీరామనవమి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు .... తెలుగు ప్రజ‌లంద‌రికీ శ్రీ‌రామ న‌వమి శుభాకాంక్షలు.

నేడు శ్రీరామనవమి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు .... తెలుగు ప్రజ‌లంద‌రికీ శ్రీ‌రామ న‌వమి శుభాకాంక్షలు. క‌రోనా నేప‌థ్యంలో ఈ పండుగ‌ను ప్రజ‌లంద‌రూ ఇళ్లల్లోనే ఉంటూ భ‌క్తి శ్రద్ధల‌తో జ‌రుపుకోవాల‌ని, శ్రీ‌రాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజ‌ల‌పై ఉండాల‌ని, ప్రజ‌లంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండేలా చూడాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అని జగన్ ట్వీట్ చేశారు.

ఇక చంద్రబాబు... " ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన ఉత్తమ పాలకుడు శ్రీరాముడు. అధికారాన్ని ప్రజోపయోగంగా ఎలా వినియోగించాలో రాముడు మనకు తెలియచెప్పాడు. అందుకే గాంధీజీ సైతం స్వతంత్ర భారతదేశం రామరాజ్యంలా విలసిల్లాలని కోరుకున్నారు. విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ది చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

ప్రతిఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశాం.అలాంటిది గత ఏడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరమని, ప్రతి ఏటా వీధివీధినా చలువపందిళ్ళలో వేడుకగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవాలు ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అయ్యాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలనేదే కోదండరాముడి ఆకాంక్ష. కాబట్టి ఈ పండుగవేళ ఇళ్ళకే పరిమితమై శ్రీరాముని దివ్య చరిత్రను మననం చేసుకుందాం. మన ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంతోపాటు సమాజ ఆరోగ్యం కాపాడదాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు" అనో చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇక శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి పలు ఆదేశాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.. పండగ రోజున ఎవరు గుడికి వెళ్ళకూడదనీ , ఆలయ అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనం వాయిదా వేసుకొని ఇంట్లోనే పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఇక అన్ని వైష్ణవ ఆలయాల్లో పూజలు కచ్చితంగా జరుగుతాయని అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించారు.

:

Show Full Article
Print Article
More On
Next Story
More Stories