Top
logo

ఇవాళ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు.. సీఎం జగన్ సూచన

ఇవాళ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు.. సీఎం జగన్ సూచనYSJagan
Highlights

ఇవాళ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు ప్రముఖమైంది. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు.

ఇవాళ గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు ప్రముఖమైంది. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు. మానవాళి పట్ల ప్రేమ, శత్రువుల పట్ల క్షమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం... ఇవీ జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశాలు.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ క్రైస్తవులకు కీలక సూచనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ద్వారా తన సందేశాన్ని వెల్లడించారు. 'గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ సండే వేడుకల్ని క్రైస్తవ సోదర సోదరీమణులంతా మీ ఇళ్ళలో, మీ కుటుంబంతో ఘనంగా జరుపుకోవాలి. కోవిడ్‌ నుంచి మానవాళిని రక్షించాలని కరుణామయుడిని మనమంతా ప్రార్థించాలి.' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


Web TitleAndhra Pradesh CM YS Jaganmohan reddy urge christians to celebrate good friday at home and with family
Next Story