ఐక్యంగా యుద్దం చేస్తేనే విజయం సాధ్యం: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ఐక్యంగా యుద్దం చేస్తేనే విజయం సాధ్యం: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌
x
YSJagan(file photo)
Highlights

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ సమావేశానికి వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకడం దురదృష్టకరమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ సమావేశానికి వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకడం దురదృష్టకరమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఒక సమావేశానికి అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొందరు విదేశీ ప్రతినిధులకు వైరస్ ఉండటంతో మ‌న దేశం వారికి కరోనా వైరస్‌ సోకింది. విపత్కర పరిస్థితిలో సీఎం జగన్‌ శనివారం వీడియో సందేశాన్ని ఇచ్చారు. మన దేశంలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో అయినా... ఇలాంటివి సంభ‌వించొచ్చు. ఈ జరిగిన సంఘటనను దురదృష్టకరంగా చూడాల‌న్నారు.

కరోనా కాటుకు కుల, మత, ప్రాంత బేధాలు లేవని, ప్ర‌జ‌లు అంద‌రూ క‌లిసి ఐక్యంగా యుద్దం చేస్తేనే ఈ మహమ్మారిని తరిమేయడం సాధ్యమవుతుందని సీఎం అన్నారు. ప్ర‌జ‌లు సామాజిక‌ దూరం పాటిస్తూ కరోనాపై పోరాటం చేయాల‌న్నారు. భారతీయులంతా ఈ సమయంలో ఒక్కటిగా ఉండాలి. కరోనా బాధితులను తప్పు చేపినట్లుగా భావించవద్దని అన్నారు. మనమంతా వారి పట్ల ఆపాయ్యతను చూపాలి అని సీఎం జగన్ తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంట‌ల‌కు ఒక్కరు దీపాలు, కొవ్వ‌త్తులు, టార్చిలైట్‌, వెలిగించాలని కోరారు. మనం ఇచ్చే ఈ సంకేతం గొప్ప ఆదర్శంగా ఉంటుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories