కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్న సీఎం వైఎస్ జగన్

కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్న సీఎం వైఎస్ జగన్
x
YSJagan
Highlights

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి కరోనా వైర‌స్ పరీక్షలు చేయించుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయ‌న‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి కరోనా వైర‌స్ పరీక్షలు చేయించుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయ‌న‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ద‌క్షిణ‌ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా సీఎం ప‌రీక్ష‌లు చేయించారు. ఈ పరీక్షల్లో సీఎంకు నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలను వేగవంతం చేసేందుకు ఏపీ సర్కార్ కంకణం కట్టుకుంది. రోజురోజుకు కరోనా నియంత్ర‌ణపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈమేర‌కు రాష్ట్రంలో లక్ష ర్యాపిడ్ కిట్లు ఆర్డర్ ఇచ్చింది. సియోల్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ర్యాపిడ్ కిట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేరుకున్నాయి.

ఈ టెస్టు కిట్లను సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం సీఎం జ‌గ‌న్ తొలి పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా కొవిడ్ 19 ఫ‌లితం 10 నిమిషాల్లో వస్తుందని అధికారులు చెప్పారు. రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా క‌రోనా టెస్టుల విధానంపై రాష్ట్రంలో అన్ని జిల్లాలో వైద్యుల‌కు శిక్షణ ఇచ్చారు. కరోనా ఆస్పత్రుల్లోనూ ఈ కిట్ల ద్వారా కోవిడ్ పరీక్షలకు వేగంగా జరగనున్నాయి.

రాష్ట్రంలో జిలాల వారిగా పాజిటివ్ కేసులు ప‌రిశీలిస్తే గుంటూరు జిల్లాలో అత్య‌ధికంగా 126 కేసులు న‌మోద‌య్యాయి, క‌ర్నూలు (126,), కృష్ణ(52), కడప(37), నెల్లూరు(64), ప్రకాశం(42), పశ్చిమ గోదావరి(34), చిత్తూరు(28), అనంతపూరం(26), విశాఖపట్నం(20), తూర్పు గోదావరి(17) జిల్లాలు ఉన్నాయి. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories