పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష

పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష
x
YS Jagan (File Photo)
Highlights

పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమృత్‌ పథకం కింద దాదాపు రూ.3,762 కోట్లరూపాయలతో...

పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమృత్‌ పథకం కింద దాదాపు రూ.3,762 కోట్లరూపాయలతో పనులు చేపట్టారు.ఆర్థికంగా బలంగాలేని మున్సిపాల్టీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాం నుంచి చాలారోజులుగా పెండింగులో ఉందని అధికారులు పేర్కొన్నారు. రూ.800 కోట్లరూపాయల గ్యాప్‌ను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, దీనికి ప్రభుత్వం తరపున గ్యారెంటీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ, గుంటూరుల్లో చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థలను సత్వరమే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ కాల్వల్లోకి చెత్తవేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. విశాఖకు నిరంతర తాగునీటి సరఫరా ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ తయారుచేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్మార్ట్‌సిటీ కింద రూ.4,578 కోట్ల విలువైన పనులు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిల్లో చేస్తున్నారు. వాటిని వేగంగా పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories