మరింత విజయవంతంగా టెలి మెడిసిన్..

మరింత విజయవంతంగా టెలి మెడిసిన్..
x
YS Jagan(file photo)
Highlights

టెలి మెడిసిన్‌ను సేవ‌ల‌ను మ‌రింత‌ విజయవంతంగా కొనసాగించాలని సీఎం జ‌గన్ అధికారులకు సూచించారు.

టెలి మెడిసిన్‌ను సేవ‌ల‌ను మ‌రింత‌ విజయవంతంగా కొనసాగించాలని సీఎం జ‌గన్ అధికారులకు సూచించారు. కుటుంబ సర్వే ద్వారా అనుమానిత ల‌క్ష్య‌ణాలు ఉన్న‌వారిని గుర్తించిన వారికీ పరీక్షలు పూర్తి చేశామని సీఎం జ‌గ‌న్ అధికారులు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన బైకులు కొనుగోలు త్వరగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య‌లు త‌గిన మందులు రాసివ్వ‌గానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలన్నారు.

క‌రోనాను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని సీఎం జ‌గ‌న్ సూచించారు. ప్రతి గ్రామంలో క్లినిక్స్‌ ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. క‌రోనా కాకుండా ఇతర కేసులు ప్రతి రోజు ఎన్ని వస్తున్నాయో సేక‌రించాల‌ని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

లాక్‌డౌన్‌ సడలింపులతో విదేనాశాల్లో చిక్కుకుపోయిన వారు వ‌స్తున్నారని, గల్ఫ్‌ నుంచే కాకుండా యూకే,అమెరికా నుంచి కూడా కొంత మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఏపీకి వ‌చ్చే వారికి క్వారంటైన్‌ సదుపాయం కావాల్సిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. ముందస్తుగా వినియోగించుకోవాలని, వాటి సంఖ్యను 1 లక్ష బెడ్లు పెంచాల‌నిఅధికారులను ఆదేశించారు. 75 వేల క్వారంటైన్‌లలో మెరుగైన సదుపాయాలు క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అదేశించారు.

ఇక వ్య‌వ‌సాయంపై జ‌రిగిన సమీక్ష‌లో 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. పసుపు, మొక్కజొన్న తక్కువ ధరకే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న ఇక్కడికి వస్తే రాష్ట్రరైతులకు నష్టం వస్తుందని, దానిని నివారించాలని అధికారులు కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories