కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష
x
cm ys jagan (File Photo)
Highlights

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష, మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు.

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 విస్తరణ, కొత్తగా నమోదైన కేసుల వివరాలను అధికారులు అందజేశారు. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. వీరిలో చాలా మంది ఢిల్లీలో ల్లో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించచారు.

రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు , జమాత్‌ నిర్వాహకులనుంచి, పోలీసులనుంచి, రైల్వే వారినుంచి.. ఇలా వివిధ రకాలుగా సమాకారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం జగన్ వెల్లడించారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని జగన్ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చేయండని సీఎం జగన్‌ కోరారు.

ఇక అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని ఆరాతీసారు. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని స్పష్టంచేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి వారు ఆరోగ్య వివరాలు అందించాలని జగన్ కోరారు. వారు ముందుకు రాకపోతే వారి కుటుంబ సభ్యులకు నష్ట కలుగుతుందని అన్నారు. ప్రజలకోసం, వాళ్ల మంచికోసమే సర్వే జరుగుతోందని జగన్ చెప్పారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు.

ఇక షెల్టర్లలో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్‌ చేయాలన్నారు సీఎం... చదువుకున్నవారు, అవగాహన ఉన్న వారు నేరుగా వెబ్‌ద్వారా సొంతంగా తమ ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు చేయవచ్చని ఆధికారులు తెలిపారు. వెబ్‌ ద్వారా నమోదు చేయవచ్చు, లేదా కాల్‌ సెంటర్‌ ద్వారా చెప్పొచ్చనని అధికారులు వెల్లడించారు.

ఇక అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరాతీశారు సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రతి దుకాణం ముందు ప్రకటించిన∙ధరలతో పట్టికను ప్రదర్శించాలని స్పష్టంచేసిన సీఎం దీనిపై మానిటరింగ్‌ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం అందించారు. ఇక గిట్టుబాటు ధరలు కల్పించడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన సీఎం తాత్కాలిక పరిష్కారంగా ప్రస్తుతానికి రైతులనుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయమన్న సీఎం అరటి, టమోటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు.

నిల్వచేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం ఆదేశించారు. తక్షణం సంబంధిత అధికారులు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలంటూ గట్టిగా ఆదేశించారు సీఎం, లాక్‌డౌన్‌ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామన్న అధికారులు దీనివల్ల రిటైల్‌ వ్యాపారం పెరుగుతుందని, రైతులకు కొంతైనా మేలు జరుగుతుందన్న అధికారులు ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

శాశ్వత పరిష్కారాలపైనా దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్‌కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలని సీఎం కోరారు. ఆమేరకు డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పే దిశగా ఆలోచన చేయాలని అన్నారు.

ప్రభుత్వంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాటిని పరిశీలించి మంచి విధానం రూపొందించాలన్న సీఎం అన్నారు.. ఆక్వా రైతులు, ఆక్వా రంగ అనుబంధ పరిశ్రమలపై సీఎం ఆరాతీశారు. 69 ప్రాససింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ –19ను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ సిబ్బందితో పనిచేయిస్తున్నారని సీఎం వెల్లడించారు.

అమెరికా, చైనాలకు ఎగుమతి కూడా ప్రారంభమైందన్న అధికారులు సోమవారం(30–03–2020) విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్‌ నుంచి 4 కంటైనర్లతో ఎగుమతి ఆయిన ఆక్వా ఉత్పత్తులు, ప్రాససింగ్‌ కేంద్రాల్లో వర్కర్స్‌ పాసుల జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లతో మాట్లాడుతున్నామన్న ఫిషరీస్‌ అధికారులు వెల్లడించారు. వారినుంచి వచ్చే సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారంకోసం పనిచేస్తున్నారని వెల్లడించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ –19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ.. ఆమేరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చూడాలన్న సీఎం, పట్టణాలు, నగరాల్లో ఉదయం 6గంటల నుంచి 11 గంటలవరకూ, మిగిలిన ప్రాంతాల్లో 6 గంటలనుంచి 1 గంటవరకూ సమయం పాటించాలన్న సీఎం జిల్లాల స్థాయిలో టాస్క్‌ఫోర్సులు పనిచేస్తున్నాయా? లేదా? మంత్రులు సమీక్షలు చేస్తున్నారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరాతీశారు.

అలాగే నియోజకవర్గాల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు పనిచేస్తున్నాయా? లేదా? అని ఆరా తీసిన సీఎం, కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ఇవి చురుగ్గా పనిచేయాలని అన్నారు. మార్కెట్‌యార్డుల ఛైర్మన్‌లనూ ఇందులో భాగస్వాములు చేయాలని సీఎం ఆదేశించారు. ఖాళీగా ఉన్న మిగతా మార్కెట్‌యార్డుల ఛైర్మన్‌ పోస్టులను భర్తీచేసి, వారినీ టాస్క్‌ఫోర్సుల్లో భాగస్వామ్యం చేయాలన్న సీఎం వివిధ రూపాల్లో సహాయం చేయాలనుకునేవారు జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌కమిటీలను సంప్రదించవచ్చనని అన్నారు.

ఆరోగ్యశ్రీ కింద పెండింగులో ఉన్న బిల్లులు అన్నింటినీ చెల్లించామని, నెట్‌ వర్కు ఆస్పత్రులకు బిల్లులన్నీ చెల్లించామని అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories