YS Jagan Review Meeting on Coronavirus Pandemic: కరోనా బాధితులకు వైద్యాన్ని నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan Review Meeting on Coronavirus Pandemic: కరోనా బాధితులకు వైద్యాన్ని నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఏపీ సీఎం వైఎస్ జగన్
x
YS Jagan Review Meeting on Coronavirus Pandemic
Highlights

YS Jagan Review Meeting on Coronavirus Pandemic: ఏపి ఆస్పత్రులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

YS Jagan Review Meeting on Coronavirus Pandemic: ఏపి ఆస్పత్రులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ సోకిన బాధితులు ఎవరైనా ఆస్పత్రికి వొస్తే వైద్యులు వారికి వైద్యం అందించడానికి నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే ఆయా ఆస్పత్రుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ కరోనా నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వైరస్ బారిన పడి మృతిచెందిన వారి అంత్యక్రియల విషయంలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కరోనా బాధితులకు అందించే సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. చేసే పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలు సాధించలేమని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఎం వైఎస్‌ జగన్ఆదేశించారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు సన్నద్ధం కావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

విపత్తు సమయంలో సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సీఎం తెలిపారు. దీనికి సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. కనీసం 17 వేలకు పైగా డాక్టర్లు, 12 వేలకు పెగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక రూపొందించి. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధం చేశామని వెల్లడించారు. కరోనా విస్తృతి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారి సేవలు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలపగా, ఆ ప్రణాళికకు సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. అదే విధంగా క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలని, వాటిలో పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలి సీఎం వైస్‌ జగన్‌ ఆదేశించారు.

కరోనా కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలలో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదే. ప్రతి క్వారంటైన్‌ కేంద్రం, కోవిడ్‌ కేర్‌ సెంటర్,కోవిడ్‌ ఆస్పత్రులకు కచ్చితంగా ర్యాండమ్‌గా కనీసం 3 ఫోన్‌ కాల్స్‌ చేయాలని తెలిపారు. క్రమం తప్పకుండా ఆ ఆసుపత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలన్నారు. భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. ''వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో కూడిన హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు.

కరోనా పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలని అవి ఎక్కడ ఉన్నాయనే దానిపై ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఎవరైనా కరోనా కరోనా అనుమానంతో ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం ఉండాలి. అదే విధంగా టెస్టులు ఎస్ఓపీ ప్రకారం చేయాలి. ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలి. అంతే కాక ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్‌ను విస్తృతంగా పెట్టాలి. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలని'' సీఎం సూచించారు.

టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు తెలిపారు. కరోనా సోకిందని తేలిన వారు ఆస్పత్రికి ఆలస్యంగా వస్తుండటంతో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. అలాగే హైరిస్క్‌ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని తెలిపారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎంపీ ప్రమాణాలున్న మందులు వాటిలో చికిత్స పొందుతున్న వారికి అందాలి. కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తి దృష్టి పెట్టండనీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories