జగన్ సర్కార్ వినూత్న నిర్ణయం.. కోవిడ్ సమాచారం ఇక ఫోన్‌లోనే

జగన్ సర్కార్ వినూత్న నిర్ణయం.. కోవిడ్ సమాచారం ఇక ఫోన్‌లోనే
x
YS Jagan
Highlights

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారం హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిజమైన సమాచారం తెలుసుకోవడం చాలా కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కోవిడ్-19పై పూర్తి సమాచారం కోసం సీఎం వైఎస్ జగన్ హెల్ప్ డెస్క్‌ ప్రారంభించారు.

కోవిడ్-19 సమాచారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. కచ్చితమైన సమాచారం కోసం పుకార్లకు తావు లేకుండా సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంది. వాట్సాప్‌లో 8297104104 నంబర్ ద్వారా, ఫేస్‌బుక్‌లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా కోవిడ్‌-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories