ప్రభుత్వ కార్యక్రమాల క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

ప్రభుత్వ కార్యక్రమాల క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
x
YS Jagan (File Photo)
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలు, కీలక పథకాల సవివరంగా గురించి వివరించారు. ఆదివాసీ దినోత్సవంతోపాటు, వైఎస్సార్ రైతు భరోసా, జగన్న విద్యాదీవెన వంటి కార్యక్రమాలు పొందుపరిచారు.

* మే 30న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తారు

* జూన్ 4న వైఎస్ఆర్ వాహన మిత్రల ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం

* జూన్ 10న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్ లకు రూ.10 వేల ఆర్థిక సాయం

* జూన్ 17న వైఎస్సార్ నేతన్న నేస్తం పేరిట ఆర్థిక సాయం

* జూన్ 24న వైఎస్సార్ కాపు నేస్తం అమలు

*జూన్ 29న ఎంఎస్ఎంఈ లకు రెండో విడతగా రూ. 450 కోట్లు విడుదల

*జూలై 1న 108, 104 కొత్త అంబులెన్సులు ప్రారంభం

*జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ

*జూలై 29న రైతులకు వడ్డీ లేని రుణాలు

*ఆగస్టు 3న జగనన్న విద్యా కానుక ప్రారంభం

*ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ

*ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.18,750 అందజేత

*ఆగస్టు 19న జగనన్న వసతి దీవెన కింద పిల్లల తల్లులకు రూ. 10 వేల చొప్పున తొలి విడత చేయూత

*ఆగస్టు 26న 15 లక్షలు వైఎస్సార్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం

* సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా ప్రారంభం

* సెప్టెంబర్ 25న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల

*అక్టోబర్ లో వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సాయం

* నవంబర్ లో జగనన్న రెండో విడత విద్యాదీవెన

* డిసెంబర్ లో అగ్రి గోల్డ్ బాధితులకు సాయం

* వచ్చే ఏడాది జనవరిలో జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం

*వైఎస్సార్ రైతు భరోసా చివరి విడత సాయం

* వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మూడో దఫా సాయం

*మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories