ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వివాదంపై స్పందించిన సీఎం జ‌గ‌న్

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వివాదంపై స్పందించిన సీఎం జ‌గ‌న్
x
Ys Jagan (File Photo)
Highlights

కరోనా వైరస్ పై పోరుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ పై పోరుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేసింది. అయితే, 10:62:eb:7d:a6:49సర్కార్ ఒక్కో కిట్‌కు రూ.730 చెల్లించిందని ప్రచారం నడుస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపట్టాయి.

ఈ క్రమంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా కట్టడిపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ మాట్లాడారు.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతిచ్చిన సంస్థకే ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిందని జగన్ చెప్పారు. ఒక్కో కిట్‌ను 795 రూపాయలకు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్‌ పేర్కొందన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్‌ నిర్ణయించిన ధర కంటే 65 తక్కువకే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ముందు కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు బయట దేశంలో తయారయ్యాయని అదే సంస్థ నుంచి మనదేశంలో తయారీకి ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చాక కిట్ల ధర తగ్గిందని సీఎం తెలిపారు. మొత్తం ఆర్డర్‌లో ప్రస్తుతం కోట్లకు 25 శాతం మాత్రమే చెల్లింపులు చేశామని, ఏ రాష్ట్రానికైనా.. తక్కువ ధరకే కిట్లను ఇస్తే ఆ ధర ప్రకారమే చెల్లిస్తామని కంపెనీకి షరతు పెట్టామన్నామని తెలిపారు. ప్రభుత్వం షరతు మేరకు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధర తగ్గించేందుకు సదరు సంస్థ అంగీకరించిందని జగన్ స్పష్టం చేశారు. రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేసే విధానంపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కిట్ల ద్వారా అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories