సీఎం జగన్ కీలక నిర్ణయం.. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వాళ్లకు రూ.2 వేలు..

సీఎం జగన్ కీలక నిర్ణయం.. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వాళ్లకు రూ.2 వేలు..
x
YSJagan(File Photo)
Highlights

కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్ చికిత్స అనంతరం తమ గడువు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్ళిన వాళ్లందరికీ రెండువేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.

కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్ చికిత్స అనంతరం తమ గడువు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్ళిన వాళ్లందరికీ రెండువేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. క్వారంటైన్ ముగిసిన వాళ్లూ తగు జాగ్రత్తలు పాటించాలి ప్రతి వారం పరీక్షలు చేయించుకోవాలి సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్వారంటైన్ లో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలని ఆదేశించారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తులు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు, పరీక్షల నిర్వహణ, ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని, రోజువారి కరోనా పరీక్షల నిర్వహణా సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. దీంతో రోజుకు 4 వేల పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం పెంచుతామని సీఎంకు అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories