Top
logo

ఏపీలో ఈ-కేవైసీ గడువు పెంపు.. వారికి మాత్రం..

ఏపీలో ఈ-కేవైసీ గడువు పెంపు.. వారికి మాత్రం..
Highlights

ఏపీలో రేషన్ కార్డుల్లో పేరున్నవారందరూ ఇప్పుడు ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ...

ఏపీలో రేషన్ కార్డుల్లో పేరున్నవారందరూ ఇప్పుడు ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్డుల్లో పేరున్నవారంతా ఈనెల 30వ తేదీలోగా ఈ-కేవైసీ చేయించుకోవాలన్న ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో లబ్దిదారులు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో మీసేవా కేంద్రాలు, రేషన్ దుకాణాలు, పోస్టాఫీసులకు జనం క్యూలు కట్టారు. నమోదు కేంద్రాల దగ్గర జనాలు తంటాలు పడుతున్నారు. ఇంతా జరుగుతున్నా నమోదు ప్రక్రియ సగం కూడా పూర్తి కాలేదు. దాంతో ఈ-కేవైసీ నమోదు గడువును పెంచింది ప్రభుత్వం. 15 ఏళ్లలోపు పిల్లలకు రేషన్ కార్డ్ నమోదు గడువు సెప్టెంబర్ 15 వరకు.. 15 ఏళ్లపై బడిన వారు నమోదు చేసుకొనే గడువు సెప్టెంబర్ 5 వరకు పొడుగించారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ ప్రకటన విడుదల చేశారు.

Next Story