స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో కొత్త కోణం.. 242 కోట్ల దోపిడీకి 2015లోనే స్కెచ్

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో కొత్త కోణం.. 242 కోట్ల దోపిడీకి 2015లోనే స్కెచ్
x

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ దూకుడు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

*జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం అంటూ బురిడీ *సంస్థతో సంబంధం లేకుండానే అందులో పనిచేసే వ్యక్తితో ఒప్పందం

AP CID: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 242 కోట్ల దోపిడీకి 2015లోనే స్కెచ్ వేసినట్లు గుర్తించారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం అంటూ బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. ఇక సంస్థతో సంబంధం లేకుండానే అందులో పనిచేసే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుసుకున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్‌పై 3వేల 281 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇవాళ విజయవాడ సీఐడీ కార్యాలయానికి మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ తరలించనున్నారు. ఇవాళ గంటా సుబ్బారావును కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2015 జూన్‌లోనే కుంభకోణానికి స్కెచ్ వేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. 241 కోట్ల రూపాయలను పలు షెల్ కంపెనీలకు బదలాయించినట్లు సీఐడీ గుర్తించింది. ఏడు షెల్ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించినట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories