నరసరావుపేటలో గోపూజా కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్

AP CM YS Jagan tour to Narasarao Peta today
x
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేట రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేట రానున్నారు. ఇక్కడ మునిసిపల్ స్టేడియంలో జరిగే గోపూజా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. టీటీడీ, దేవాదాయశాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కనుమ పండగను పురస్కరించుకుని గోపూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నరసరావుపేటలో లాంచనంగా ప్రారంభిస్తారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నరసరావుపేట పర్యటన ఇలా..

- ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సిఎం బయలుదేరతారు.

- ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు.

- అక్కడి మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు.

- అనంతరం గోపూజలో పాల్గొంటారు.

- మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్‌ తాడేపల్లి చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories