ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు

X
Highlights
CM Y.S.Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
K V D Varma24 Oct 2020 5:08 AM GMT
విజయదశమి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై అంతిమ విజయం మంచే సాధిస్తుందని నిరూపించిన పర్వదినం దసరా అని అయన తన శుభాకంక్షల సందేశంలో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకంక్షల సందేశం ఇదీ..
''రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటింది. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నాను''
Web TitleAndhra Pradesh Chief Minister Jaganmohan Reddy convey Dasara greetings to people
Next Story