Andhra Pradesh పశువుకు ఎంత బీమా అందుతుంది?

Andhra Pradesh పశువుకు ఎంత బీమా అందుతుంది?
x
Highlights

ఏపీలో పశువుల బీమా పథకం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. పశువు మరణిస్తే రూ. 30,000 వరకు పరిహారం అందించే ఈ పథకంలో రైతు కేవలం 15% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఈ పథకం కింద పశువు రకాన్ని బట్టి ప్రభుత్వం పరిహారాన్ని నిర్ణయించింది:

ప్రీమియం వివరాలు:

ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే.. బీమా ప్రీమియం మొత్తంలో సింహభాగం అంటే 85 శాతం నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రైతు కేవలం 15 శాతం (సుమారు రూ. 144 నుంచి రూ. 288 వరకు) చెల్లిస్తే సరిపోతుంది.

పథకం యొక్క ముఖ్య నిబంధనలు:

పరిమితి: ఒక రైతు గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలకు మాత్రమే బీమా చేయించుకోవచ్చు.

ఇతర జీవాలు: గొర్రెలు/మేకల వంటి జీవాలు 100 వరకు, పందులు 50 వరకు బీమా పరిధిలోకి వస్తాయి.

ప్రయోజనం: పశువులు అకాల మరణం చెందితే నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకే బీమా సొమ్ము జమ అవుతుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఈ పథకానికి దరఖాస్తులు నేటి (జనవరి 19) నుంచే ప్రారంభమయ్యాయి.

  1. ప్రత్యేక శిబిరాలు: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పశువైద్య శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. వైద్య పరీక్షలు: బీమా చేసే ముందు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వాటికి ట్యాగ్‌లు వేస్తారు.
  3. ప్రీమియం చెల్లింపు: శిబిరాల్లోనే నిర్ణీత ప్రీమియం మొత్తాన్ని చెల్లించి రశీదు పొందవచ్చు.
  4. తేదీలు: ఈ నెల 31 నుంచి నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories