AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ..కీలక బిల్లులకు ఆమోదం..

Andhra Pradesh Cabinet Meeting Ended Today | AP Live News
x

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ

Highlights

AP Cabinet Meeting: అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు కంపల్సరీపై ప్రచారానికి ఆమోదం...

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానానికి అమోదం తెలిపింది కేబినెట్‌. అలాగే.. అదాని ఎంటర్‌ ప్రైజెస్‌కు విశాఖలోని మధురవాడలో 130 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది.

ఇక.. మధురవాడలో శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది మంత్రి వర్గం. 200 మెగా డేటా సెంటర్‌, బిజినెస్‌ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు ఆమోదం తెలిపింది. 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరా కోసం త్రైపాక్షిక ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక.. 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు వీలుగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా అంగీకారం తెలిపింది. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారానికి ఆమోదం ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది ఏపీ కేబినెట్.

Show Full Article
Print Article
Next Story
More Stories