ప్రజల ప్రాణాలు ముఖ్యం .. ఆ పని చేయండి.. సీఎంకు కన్నా విజ్ఞప్తి


కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర 21రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర 21రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14తో రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ లాక్ డౌన్ ముగుస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కొనసాగించాలని మోదీతో జరిగిన సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భిన్నంగా మాట్లాడారు. లాక్ డౌన్ రెడ్ జోన్లకే పరిమితం చేయాలని వ్యసాయపనులకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రలో ప్రతిపక్షాలు లాక్ డౌన్ కొనసాగించాలని తీర్మానించాయి. ఏపీ ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనాణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఓవైపు రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, లాక్‌డౌన్ సడలించడం లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అది సరైంది కాదని అన్నారు.
ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) సైతం మనదేశం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని అభినందించాయని కన్నా పేర్కొన్నారు. ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థను క్రబద్దీకరించాల్సిన అవసరం ఉంది. అయినప్పటీకీ ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. ఒడిశా లాంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని ఎలాంటి సడలింపులు వద్దని కన్నాలక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



