ఏపీ ప్రభుత్వం పై బీజేపీ సీరియస్.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ఏపీ ప్రభుత్వం పై బీజేపీ సీరియస్.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
x
YSJagan (file photo)
Highlights

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణ‌యంపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ధ్వ‌జ‌మెత్తారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణ‌యంపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ధ్వ‌జ‌మెత్తారు.క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణ‌యంపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రంలో హిందూ దేవాలయాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంపై ఆయ‌న అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాల‌యాల‌ను క్వారంటైన్ కేంద్రాలుగా మారిస్తే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయ‌ని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజులురోజుకు పెరుగుతున్నాయని.., అయితే, క‌రోనా అనుమానితుల‌కు, క‌రోనా రోగుల‌కు చికిత్స అందించేందుకు ప్ర‌భుత్వం దేవాల‌యాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌న్నారు. అయితే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంటే ఇదో దుర్మార్గమైన ఆలోచన అని క‌న్నా విమ‌ర్శించారు.

చిత్తూరు జిల్లాలోని ప్ర‌సిద్ధి దేయాలైయాలైనా శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మారుస్తున్నారన్న వార్త‌ల్లో వాస్త‌వం ఉందో లేదో ప్రభుత్వం బ‌య‌ట‌పెట్టాల‌న్నారు. ఈ నిర్ణ‌యాన్ని తక్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని తెలిపారు.

రాష్ట్రంలో క‌రోనా రోగులు సంఖ్య‌ అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరాయి. దీంతో క‌రోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యులు, స‌న్నీహితుల‌ను క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో క్వారంటైన్ కేంద్రాలు సరిపోక‌పోవ‌డంతో దేవాలయాలను కూడా క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ముందుగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో క్వారంటైన్ సెంటర్లకు అధికారులు ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories