వారు మాత్రమే అసెంబ్లీకి రావాలి.. మాస్క్, భౌతకదూరం తప్పనిసరి

వారు మాత్రమే అసెంబ్లీకి రావాలి.. మాస్క్, భౌతకదూరం తప్పనిసరి
x
Highlights

రేపట్నుంచి జరిగే అసెంబ్లీకి హాజరయ్యే వారిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధంలో భాగంగా అందరి మాదిరిగానే చర్యలు తీసుకోవాలని...

రేపట్నుంచి జరిగే అసెంబ్లీకి హాజరయ్యే వారిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధంలో భాగంగా అందరి మాదిరిగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనిలో భాగంగా ఏపీ అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేయగా, వాటిని సంబంధిత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూన్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మంత్రులు, ఎమ్మెల్యే తమ వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకురావొద్దని కార్యదర్శి కోరారు. అసెంబ్లీ జరిగే నాలుగు రోజుల పాటు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో పలు నియంత్రణా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రత్యేక నిబంధనలను జారీ చేశారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

అలాగే ఎమ్మెల్యేలు తమ కార్లకు ఖచ్చితంగా పాస్ అతికించాలన్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అసెంబ్లీలోకి విజిటర్లను కూడా అనుమతించటడం లేదన్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. సభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలాగే సభ్యుల పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను కూడా వెంట తీసుకురావడానికి వీల్లేదని పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories