ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి పొడిగింపు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి పొడిగింపు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరో రోజు పొడిగించారు. మూడు రోజలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మొదట నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరో రోజు పొడిగించారు. మూడు రోజలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. దీంతో అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ జరిగేలా టీడీపీ పట్టుబడుతోంది.

కాగా..శాసనమండలిలో ఓటింగ్ జరిగి ఓడిపోతే గురువారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్లాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ కు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తు్న్న నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ ను మండలికి పిలిపించిన సంగతి తెలిసిందే. దీంతో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం శాసనమండలికి వచ్చారు. ఒక వేళ ఓటింగ్ జరిగి ఓడిపోతే రేపు అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories