ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం

ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
x
Highlights

బీఏసీ సమావేశం ముగిసింది. ఈ ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్వహించింది.

బీఏసీ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్వహించింది. మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చకు ఆమోదం లభించింది. రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగనే స్వయంగా అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని దీనిపై చర్చను ప్రారంభించారు. సాధారణంగా ఇటువంటి బిల్లులను శాసనసభా వ్యవహార శాఖా మంత్రి ప్రవేశపెడతారు. అయితే ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై ఆసక్తికరంగా మారింది.

బిల్లును ప్రవేశపెట్టిన సీఎం దీనిపై సుదీర్ఘంగా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. మండలి రద్దుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే మండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సలహాలు ఇస్తుంది అని ఏర్పాటు చేసుకున్న మండలి రాజకీయాలకు వాడుకుంటున్నారని అభిప్రాయపడింది. ఈ మేరకు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దాదాపు గంటపాటు చర్చించిన క్యాబినెట్ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories