ఏపీలో లాక్ డౌన్ తర్వాతే పది పరీక్షలు : మంత్రి ఆదిమూలపు సురేష్

ఏపీలో లాక్ డౌన్ తర్వాతే పది పరీక్షలు : మంత్రి ఆదిమూలపు సురేష్
x
Highlights

కరోనా వైరస్ ప్రభావం లాక్‌డౌన్‌‌తో అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి.

కరోనా వైరస్ ప్రభావం లాక్‌డౌన్‌‌తో అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీలో జూన్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. లాక్‌ డౌన్‌ ముగిసిన 2వారాల తరువాత పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో టీచర్ల నియామకానికి సంబంధించి 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

అలాగే ఎస్‌జీటీ, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీఈటీల పోస్టులపై కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హిందీ, తెలుగు పండిట్‌ పోస్టుల వ్యాజ్యాలు క్లియర్‌ అయ్యాయన్నారు. డీఎస్సీ వివాదాలు పూర్తిగా సమసిపోయి, నియామకాలు పూర్తయ్యాకే కొత్త టెట్, డీఎస్సీలపై నిర్ణయం మంత్రి తీసుకోనున్నారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం అవాస్తవమని మంత్రి సురేష్ అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories