YSR Jalakala Scheme: ఏపీలో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు.. ఈ నెల 28న 'వైఎస్సార్‌ జలకళ' ప్రారంభం...

YSR Jalakala Scheme: ఏపీలో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు.. ఈ నెల 28న వైఎస్సార్‌ జలకళ ప్రారంభం...
x
Highlights

YSR Jalakala Scheme: నవరత్నాల పధకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం వైయస్‌ఆర్ జాలకళ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

YSR Jalakala Scheme: నవరత్నాల పధకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం వైయస్‌ఆర్ జాలకళ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హతగల రైతులు ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత గ్రామ కార్యదర్శుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ కుమార్ రెడ్డి తెలిపారు. అన్ని దరఖాస్తులు అర్హత ప్రమాణాల ప్రకారం పరిశీలించబడతాయి మరియు హైడ్రో లాజికల్, జియో ఫిసికల్ సర్వే తర్వాత సాధ్యాసాధ్యాల ఆధారంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభమవుతాయి. అలాగే బోర్లు తవ్వే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన తర్వాతే చెల్లింపులు జరుపుతామని విజయ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు.

సెప్టెంబర్ 28న సీఎం జగన్‌ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అంతే కాదు, ఈ ప్రోగ్రాం ను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేయబడింది అని అయన తెలిపారు. సెక్రటేరియట్ నుండి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించనున్నారు. ఇది సమయానుసారంగా, పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం కోసం రైతు దరఖాస్తును సమర్పించిన తర్వాత, దరఖాస్తు పరిశీలన, ప్రతి దశలో దరఖాస్తు స్థితిని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అర్హతగల కలిగిన రైతులు ఈ కార్యక్రమానికి సెప్టెంబర్ 28 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం అర్హులైన ర్య్తులందరూ గ్రామ, వార్డు సచివాలయంలో కనీ, లేదా అన్ లైన్లో గానీ దరకాస్తు చేసుకోవచ్చని కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం అర్హులైన రీతులను ఎంపిక చేసి బోర్లను తవ్విస్తామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories