హైకోర్టుకు చేరిన రాజధానుల పంచాయితీ

హైకోర్టుకు చేరిన రాజధానుల పంచాయితీ
x
హైకోర్టుకు చేరిన రాజధానుల పంచాయితీ
Highlights

మూడు రాజధానుల పంచాయితీ హైకోర్టుకు చేరింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 37 మంది రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతినే...

మూడు రాజధానుల పంచాయితీ హైకోర్టుకు చేరింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 37 మంది రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించనుంది. మరోపక్క సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ వేశారు. పిల్‌‌లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, సీఎం, మంత్రులు బొత్స, బొగ్గన, సీఎస్‌లను చేర్చారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. వ్యాపార సముదాయాలు, స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేశారు. రిలే నిరాహారదీక్షలు, నిరసనలతో తుళ్లూరు, మందడం, వెలగపూడి, మంగళగిరి, యర్రబాలెం, కృష‌్ణయపాలెం, తాడికొండ గ్రామాలు ఉద్రిక్తంగా మారాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories