సూరి సతీమణి భానుమతికి 'జడ్పీ' లైన్ క్లియర్ అయిందా?

సూరి సతీమణి భానుమతికి జడ్పీ లైన్ క్లియర్ అయిందా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సమరం మొదలైంది. ఇప్పటికే ఆశావహులు తమ పొలిటికల్ బాస్ లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. హైకోర్టు సూచనను పాటిస్తూ.. శుక్రవారం...

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సమరం మొదలైంది. ఇప్పటికే ఆశావహులు తమ పొలిటికల్ బాస్ లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. హైకోర్టు సూచనను పాటిస్తూ.. శుక్రవారం జడ్పీ రిజర్వేషన్లను ఖరారు చేసింది ప్రభుత్వం.. అనంతపురం జిల్లా పరిషత్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో బోయ, కురుబ, గౌడ కులాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో అధికార వైసీపీలో అయితే టిక్కెట్ల పోటీ ఎక్కువగా ఉంది. దివంగత నేత, జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి (సూరి) సతీమణి భానుమతి జడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆమె గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. సూరిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

తొలినుంచి వైసీపీలో యాక్టీవ్ కార్యకర్తగా కోనసాగుతున్నారు. 2014-19 లలో రాప్తాడు అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు.. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉండటంతో ఆమెకు సీటు దక్కలేదు. గడిచిన సాధారణ ఎన్నికలకు ముందే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు జడ్పీ పీఠం హామీ ఇచ్చినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జడ్పీ స్థానం కూడా బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దాంతో ఆమె పెనుగొండ లేదా రాప్తాడు నియోజకవర్గంలోని ఏదో ఒక మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందని జిల్లాలో టాక్ వినబడుతోంది.

వాస్తవానికి 2004 ఎన్నికల్లో పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవిపై పోటీ చేశారామె. అయితే 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో భానుమతి సరిగా ప్రచారం నిర్వహించలేదు. పైగా ఆమె భర్త సూర్యనారాయణరెడ్డి అప్పుడు జైల్లో ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి, సూరి మరణం అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారామె.. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ పీఠంపై కూర్చుంటారని గుసగుసలు వినబడుతున్నాయి. మరి భానుమతి ఆశలు ఎంతవరకు తీరతాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories