వైసీపీ మహిళా నాయకురాలు గంగుల భానుమతి ఇంట విషాదం

వైసీపీ మహిళా నాయకురాలు గంగుల భానుమతి ఇంట విషాదం
x
Highlights

వైసీపీ మహిళా నాయకురాలు గంగుల భానుమతి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి రుద్రప్ప గౌడ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స...

వైసీపీ మహిళా నాయకురాలు గంగుల భానుమతి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి రుద్రప్ప గౌడ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి అలాగే పలువురు నేతలు రుద్రప్ప గౌడ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కాగా గంగుల భానుమతి.. దివంగత మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి(సూరి) సతీమణి. 2004 పెనుగొండ అసెంబ్లీకి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చేతిలో ఓటమిచెందారు. 2012 లో వైసీపీలో చేరిన భానుమతి రాప్తాడు టిక్కెట్ కోసం ప్రయత్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories