అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ కాల్పుల కలకలం

అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ కాల్పుల కలకలం రాజా, అజయ్ అనే వ్యక్తులు మద్యం సేవించే క్రమంలో గొడవ ఇంకొంచెం మద్యం పోయాలని అడగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Dec 2025 4:30 PM IST
అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ కాల్పుల కలకలం
X

అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ కాల్పుల కలకలం

అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ జరిపిన కాల్పులు కలకలం రేపాయి. రాజా, అజయ్ అనే వ్యక్తులు స్నేహితులతో కలిసి మద్యం సేవించే క్రమంలో గొడవ జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. తీవ్రస్థాయిలో గొడవ జరగడంతో.. అజయ్, రాజాపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ, తన బృందంతో నిందితుడు అజయ్ను పట్టుకోవడానికి వెళ్లగా.. పోలీసులపై అజయ్ కత్తితో దాడి చేశాడు. నిందితుడు పారిపోతుండగా.. సీఐ అతడి మోకాళ్లపై కాల్పులు జరిపాడు. అనంతరం అజయ్‌ని అదుపులోకి తీసుకుని.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story