ఆనంపై ఆశలు పెట్టుకున్న ప్రత్యర్థులకు అసంతృప్తి

ఆనంపై ఆశలు పెట్టుకున్న ప్రత్యర్థులకు అసంతృప్తి
x
Highlights

ఆనం రామనాయణరెడ్డి.. రాజకీయాల్లో తిరుగులేని నేత, ఒంటిచేత్తో నెల్లూరు జిల్లాలో రాజకీయాలను శాశించారు. ఆయనకు అన్న వివేకానందరెడ్డి తోడయ్యారు. ఇంకేముంది...

ఆనం రామనాయణరెడ్డి.. రాజకీయాల్లో తిరుగులేని నేత, ఒంటిచేత్తో నెల్లూరు జిల్లాలో రాజకీయాలను శాశించారు. ఆయనకు అన్న వివేకానందరెడ్డి తోడయ్యారు. ఇంకేముంది దశాబ్దకాలం రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. మొదట టీడీపీతో రాజకీయ రంగప్రవేశం చేసి.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు.. మళ్ళీ టీడీపీలోకి వెళ్లి.. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లినా ఆనం ముద్ర ఉండాల్సిందే. అయితే ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కాక రేపాయి. దాంతో అధిష్టానం కూడా సీరియస్ అయింది. షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వాలని అనుకుంది. ఈ తరుణంలో ఆనం వ్యతిరేకులు ఇంకేముంది.. అధిష్టానానికి అడ్డంగా బుక్కయ్యారని ఆనం పని అయిపోయిందని అనుకున్నారట.

కట్ చేస్తే షోకాజ్ నోటీసులు లేవు, మందలింపులు అంతకన్నా లేవు. ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆనంను సీఎం జగన్ పిలిపించుకున్నారట. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నేరుగా తనతోనే చెప్పాలని చెప్పారట.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని సూచించారట జగన్. దాంతో ఆనం రామనారాయణరెడ్డి వ్యతిరేక వర్గం ఆశలు అడియాశలు అయినట్టయిందట. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆనంకు షోకాజ్ నోటీసు ఇస్తారని అనుకుంటే ఇలా సింపుల్ గా ముగించేసారేంటని చర్చించుకుంటున్నారట. ఆయన కాబట్టి జగన్ చూసి చూడనట్టు ఉన్నారు.. అదే మరొకరైతే ట్రీట్మెంట్ మరోలా ఉండేదని అనుకుంటున్నారట. ఆనంపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇటు ఆయన వర్గంలో కూడా సంతోషం నెలకొందట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories