నంద్యాల మాజీ ఎంపీ ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి

నంద్యాల మాజీ ఎంపీ ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
x
Highlights

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోనీ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రోస్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్...

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోనీ మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రోస్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ సంఘటనలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగి శ్రీనివాస్‌ రెడ్డి (50) మృతి చెందాడు. మృతుడితో పాటు ఉన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

కంపెనీ లోపల గ్యాస్ లీక్ అయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు. విషవాయువు మరోవైపు ఆగ్రో ఫ్లాంట్‌ చుట్టూ గ్యాస్‌ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన చెందవద్దనీ అన్ని అధికారులు చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, వైద్య శాఖ అధికారులు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు యుద్ధప్రాతపదికన చర్యలు చేపట్టారు.

విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి అత్యవసర శాఖల అధికారులను యుద్ధప్రాతిపదికన రంగంలోకి దింపి సేఫ్టీ చర్యలు చేపట్టామనీ కర్నూల్ కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఫ్యాక్టరీలో ఉన్నవారిని బయటకు తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories