Nandyal: పొలంలో దొరికిన పురాతన విగ్రహం.. అమ్మవారు కలలోకి వచ్చి చెప్పారట

Ammavari Ancient Idol Found In A Land Near Sugalimetta Nandyal District
x

Nandyal: పొలంలో దొరికిన పురాతన విగ్రహం.. అమ్మవారు కలలోకి వచ్చి చెప్పారట

Highlights

Nandyal: విగ్రహాన్ని చూడటానికి తండోపతండాలుగా వస్తున్న జనం

Nandyal: నంద్యాల జిల్లాలో పురాతన విగ్రహం బయటపడింది. నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి ఈ విగ్రహం బయట పడింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మహనందిని దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెవిలో చెప్పినట్టు తెలిపారు. గత రెండు రోజుల నుంచి వెతకగా సుగాలిమెట్ట వద్ద అమ్మవారి విగ్రహం బయటపడిందని చెబుతున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుదీరారు.

అమ్మవారి విగ్రహం బయటపడడంతో సుగాలిమెట్ట ప్రాంతం కోలాహలంగా మారింది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు, టెంకాయలు కొడుతున్నారు.అమ్మవారే స్వయంగా భక్తుడి కలలోకి వచ్చి తాను ఎక్కడ ఉన్నానో చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం తెలియడంతో స్థానికులతో పాటుగా చుట్టపక్కల గ్రామాల నుంచి జనాలు అక్కడికి వస్తున్నారు. అయితే ఈ విగ్రహం ఎప్పటిదో క్లారిటీ లేదు. అమ్మవారి విగ్రహం వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అయితే అమ్మవారు ఓవ్యక్తి ఇక్కడ నేను ఉన్నాయని చెప్పడంతో అందరూ కలిసి వెతకడం మొదలు పెట్టారని, నిజంగా విగ్రహం బయటపడిందని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అమ్మవారి మహిమేనని అంటున్నారు. విగ్రహాన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ఇది నిజంగా విచిత్రమేననంటున్నారు. తామంతా చందాలు వేసుకొని అమ్మవారికి గుడి కడతామని స్థానికులంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories