చంద్రబాబుకు మోదీ సపోర్ట్... విశాఖ ఉక్కుపై అమిత్ షా ఏమన్నారంటే...

Amit Shah about Chandrababu Naidu
x

ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Highlights

Amit Shah about Chandrababu Naidu: గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో అందరికీ తెలిసిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు....

Amit Shah about Chandrababu Naidu: గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో అందరికీ తెలిసిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆనాడు జరిగిన విధ్వంసం గురించి రాష్ట్ర ప్రజలు ఇంకా చింతించాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో అంతకు మూడింతల ప్రగతి సాధిస్తాం అని ధీమా వ్యక్తంచేశారు. అందుకు కేంద్రం నుండి అవసమైన అన్ని సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నుండి అన్నిరకాలుగా అండదండలున్నాయని అమిత్ షా గుర్తుచేశారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ఇవాళ జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. అందులో భాగంగానే కేవలం 6 నెలల వ్యవధిలోనే 3 లక్షల కోట్ల విలువైన సాయం చేయడం జరిగిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవంగా భావించే విశాఖ ఉక్కును కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం కేంద్రం నుండి రూ. 11,440 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories